కాగజ్‎నగర్‎లో ఓటేసిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

By :  Aruna
Update: 2023-11-30 06:04 GMT

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగజ్‎నగర్‎లోని ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్‎లో ప్రవీణ్ కుమార్ ఓటేసారు.

అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ.. "భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ అద్భుతమైంది. నా బాధ్యతగా నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి.

అక్రమ సంపాదనతో కొంత మంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను డబ్బు, మద్యంతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓట్లను కొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లు ఇది గమనించండి. ఎలాంటి ప్రలోభాలకు ,బెదిరింపులకు లొంగిపోకండి. నిర్భయంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేసే నాయకులనే ఎన్నుకోండి. సిర్పూర్ ప్రాంతంలో దోపిడీ, దౌర్జన్యాలు,బెదిరింపుల పాలన పోవాలని నన్ను దత్తత తీసుకున్న సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను". అని ప్రవీణ్ కుమార్ తెలిపారు. 

Tags:    

Similar News