Sitakka : ప్రగతిభవన్లో కేటీఆర్ పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షల ఇల్లు: మంత్రి సీతక్క

Byline :  Bharath
Update: 2024-01-29 05:33 GMT

మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ప్రగతిభవన్ లో తన పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షలతో ఇల్లు కట్టించారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనల నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నా.. గూడు లేక ఇబ్బందులు పడుతున్నా ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూంలని ఆశ చూపి.. ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఇష్టమొచ్చినట్లు నిధులు ఖర్చు చేసి.. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని సీతక్క ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. కాంగ్రెస్ పాలనలో అందరికీ న్యాయం చేస్తామని సీతక్క అన్నారు.

కుక్కల కోసం రూ.12 లక్షలతో ఇల్లు కట్టడం దారుణం? అది చూశాక తనకు ఆశ్చర్య వేసింది. రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిని ఏనాడు పట్టించుకోని బీఆర్ఎస్.. కుక్కలకోసం రూ.12 లక్షలతో ఇల్లు కట్టడంపై సీతక్క విమర్శలు మండిపడ్డారు. భూములకు పట్టాలు లేక.. కాస్తులో ఒకరి పేరు.. పట్టాలో మరొకరి పేర్లు ఉన్నాయని, ధరణితో ప్రజల బతుకులు ఆగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు తప్పకుండా చేసి తీరుతుంది. నిరుపేదలను గుర్తించి రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తాం. ధరణితో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని సీతక్క స్పష్టం చేశారు.



 

Tags:    

Similar News