వరంగల్లో కరోనా కలకలం.. ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులు..

By :  Bharath
Update: 2023-12-30 15:21 GMT

వరంగల్‌ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేపింది. వరంగల్ లోని ఎంజీఎం హస్పిటల్ లో ఆరుగురు చిన్నారులకు కరోనా సోకింది. దీంతో ఎంజీఎంలోని పీడియాట్రిక్‌ వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటుచేశారు. కరోనా సోకిన చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. దీంతో కాకతీయ మెడికల్‌ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌లో ఆ చిన్నారులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

దాంతో ఆ చిన్నారులకు కొవిడ్ నిర్దారణ అయింది. ఇటీవల నీలోఫర్ హాస్పిటల్ లో ముగ్గరు చిన్నారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇందులో చిన్నారులు కూడా ఉండటం సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




Tags:    

Similar News