తెలంగాణలో జరిగిన ఆ దుర్ఘటనపై స్మితా సబర్వాల్ స్పందించాలి : ఎమ్మెల్యే రఘునందన్ రావు

Update: 2023-07-24 06:53 GMT

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‎గా ఉంటారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలపై సోషల్ మీడియా వేదికగా తన గొంతును వినిపిస్తుంటారు స్మితా. తాజాగా మణిపూర్‎లో జరుగుతున్న హింసాకాండపైన రియాక్ట్ అయ్యారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆమె ట్విటర్ వేదికగా ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‎తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‎గా మారారు స్మితా సబర్వాల్. సోషల్ మీడియాలో ఆమె చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మణిపూర్ ఘటనపై స్పందించిన సబర్వాల్‎కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ చేసిన దాడి గురించి స్పందించాలని ట్విటర్ వేదికగా ఆమెను డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై వెంటనే స్పందిస్తూ మీరు ట్వీట్లు పెడతారు. ఇప్పుడు మీరు ఉన్న తెలంగాణలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా రియాక్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం అని రఘునందన్ రావు ట్వీట్ చేశారు.

రఘునందన్ రావుతో పాటు కొంత మంది నెటిజన్లు సైతం ఈ అంశాంపై స్మితా సబర్వాల్ స్పందన ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు స్మిత సబర్వాల్ వ్యవహారం పక్కా రాజకీయ నాయకురాలిగా ఉందని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో జరిగిన ఈ దారుణమైన ఘటనపై ఎందుకు నోరుమెదపడంలేదని ఆమెపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. మరి తాజా విమర్శలపై స్మితా సబర్వాల్ ఎలాంటి రిప్లై ఇస్తారో మాత్రం వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News