అర్వింద్కు బీజేపీ సోషల్ మీడియా బాధ్యతలు..!

Update: 2023-07-24 07:35 GMT

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతోంది. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాను మరింత ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీకి ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎంపీ అర్వింద్ ఇప్పటికే కేసీఆర్ సర్కార్ అవినీతిని ఎండగడుతున్నారు.


Tags:    

Similar News