తెలంగాణ మహిళలకు నెలకు 2500.. 500కే సిలిండర్ : సోనియా గాంధీ

Byline :  Krishna
Update: 2023-09-17 13:34 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించింది. తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో ఆరు గ్యారెంటీ స్కీములను ప్రకటించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మహాలక్ష్మీ స్కీంను ప్రకటించారు. మహాలక్ష్మీ స్కీంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా రూ.500 కే గ్యాస్ సిలిండర్, బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.

తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు అంటూ సోనియాగాంధీ స్పీచ్ స్టార్ట్ చేశారు.చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. నెరవేర్చే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను ఉన్నస్థానాలకు చేర్చుతామని చెప్పారు. అంతకుముందు గాంధీ ఐడియాలజీ సెంటర్కు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కలిసి సోనియా శంకుస్థాపన చేశారు.


Tags:    

Similar News