మిచువాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. మిచువాంగ్ దాటికి సౌత్ సెంట్రల్ రైల్వే.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే 18 రైళ్లు రద్దు చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఇటీవల పలు రైళ్లను రద్దుచేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని కోరింది. ఈ నెల 8న నడవాల్సిన న్యూ తిన్‌సుకియా – బెంగళూరు, న్యూ జాల్పాయ్‌గురి – చెన్నై సెంట్రల్, న్యూ తిన్‌సుకియా- కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. 9న నడవాల్సిన అగర్తలా- ఎస్ఎంవీటీ బెంగళూరులో రైళ్లను నడవాల్సిన చెన్నై సెంట్రల్- తిరుపతి, ఇవాళ నడవాల్సిన 13 రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. రద్దైన రైళ్లలో చెన్నై సెంట్రల్-హైదరాబాద్, చెంగల్ పట్టు- కాచిగూడ రైళ్లు కూడా ఉన్నాయి.
Cancellation/Diversion/Short Termination of Trains#CycloneMichuang #TrainsUpdate pic.twitter.com/cayqC01ezz
— South Central Railway (@SCRailwayIndia) December 7, 2023