దీపావళికి ద.మ. రైల్వే 90 ప్రత్యేక రైళ్లు.. తెలుగోళ్లకు ఖుషీ

Update: 2023-11-10 16:04 GMT

పండగ సీజన్లలో ప్రత్యేక రైళ్లు నడిపే దక్షిణ మధ్య రైల్వే దీపావళికి కూడా భారీ సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ వేసింది. దీపావళితోపాటు ఉత్తరాది భారతీయులు ఘనంగా జరుపుకునే ఛత్‌ పండగను కూడా పురస్కరించుకుని 90 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటిలో అత్యధికం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవే. ఈ నెల 9 నుంచి 30వ తేదీవరకు ఇవి నడుస్తాయి. వీటితోపాటు నిజామాబాద్‌, నాందేడ్‌ మీదుగా సికింద్రాబాద్‌ నుంచి రక్సాల్‌ మధ్య నాలుగు జన్‌ సాధారణ్‌ ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే నడుపుతోంది. వీటిలో 22 అన్‌ రిజర్వ్‌డ్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు ఉంటాయి. 2400 మంది కూర్చోవచ్చు. చార్జీలు కూడా తక్కువే. ఇవి ఈ నెల 12, 14, 19, 21ల్లో నడుస్తాయి. స్పెషల్ ట్రైన్‌లు నడిచే రూట్ల వివరాలతో ఓ జాబితా విడుదల చేసింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు..


 








 



 




 



 


Tags:    

Similar News