ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్

Byline :  Kiran
Update: 2023-08-30 15:42 GMT

ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం సాంకేతిక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో పాటు కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన విద్యార్థులు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అదే కాలేజీలో సీట్లు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1న స్లైడింగ్ నిర్వహించాలని అధికారులు కాలేజీలకు సూచించారు.




 


ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1న కాలేజీలు స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు ఆదేశించారు. సెప్టెంబర్ 2న ఖాళీల వివరాలు ప్రకటించి 3,4 తేదీల్లో స్పాడ్ అడ్మిషన్ల ప్రాసెస్ పూర్తిచేయాలని సూచించారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తైన అనంతరం వివిధ కాలేజీల్లో 18,815 సీట్లు మిగిలిపోయాయి. దీంతో ఆ సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం https//tseamcet.nic.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు. 




Tags:    

Similar News