సెక్రటేరియెట్లో హడావిడి స్టార్ట్.. 6వ అంతస్తు ఖాళీ

Byline :  Bharath
Update: 2023-12-05 13:32 GMT

తెలంగాణలో హడావిడి మొదలైంది. కొత్త సీఎం గద్దెనెక్కేందుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసే కొత్తగా ప్రభుత్వం కోసం.. ప్రోటోకాల్ విభాగం కొత్త సెక్రటేరియెట్ లోని సీఎంఓ కార్యాలయ్యాన్ని ముస్తాబు చేస్తుంది. ఇంతకాలం కేసీఆర్ సీఎంగా ఉన్న ఆరో అంతస్తులోని ఆఫీస్ లో మార్పులు చేస్తున్నారు. పాత ఫైళ్లను మరో చోటుకు షిఫ్ట్ చేస్తున్నారు. దీనిపై ప్రధాన కార్యదర్శే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రస్తుతం సీఎం కార్యాలయంలో సెక్రటరీలు, అడ్వైజర్లు, ఓఎస్డీ చాంబర్లను కూడా ఖాళీ చేయిస్తున్నారు.

ఆరో అంతస్తులో మొత్తం సీఎంకు సంబంధించిన చాంబర్లే ఉండటంతో కొత్తగా వచ్చే సీఎం కోసం అన్ని పేషీలను, చాంబర్లను రెడీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపడతారని ఊహాగానాలు వస్తుండటంతో పలు డిపార్టుమెంట్ల అధికారులు హోటల్ లో బస చేసినన ఆయనను కలిశారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టే వారిని ప్రోటోకాల్ ప్రకారం కలవడం ప్రధాన కార్యదర్శి ఆనవాయితీ కావడంతో.. సీఎస్ శాంతకుమారి రేవంత్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News