కుల‌వృత్తులు, చేతివృత్తుల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం.. ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

Update: 2023-06-06 09:02 GMT

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తుల వారి కోసం కేసీఆర్‌ సర్కార్‌ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లో నిర్ణయించింది. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.



ఈ నేప‌థ్యంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల కులవృత్తులు, చేతివృత్తుల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం అందించే ప్ర‌క్రియ మొద‌లైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్రారంభించారు. https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం సహా 38 కాలమ్‌ల‌తో స‌ర‌ళ‌మైన అప్లికేష‌న్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా త‌క్ష‌ణ‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించ‌నున్నారు.

https://tsobmmsbc.cgg.gov.in

దీని కోసం ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో సరళమైన అప్లికేషన్ రూపొందించారు. కుల వృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, మరియు ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించనుంది కేసీఆర్‌ సర్కార్‌.  






Tags:    

Similar News