మోరంచపల్లి వాసులకు ఆహారం, నీరు సరఫరా: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Update: 2023-07-27 07:01 GMT

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మోరంచపల్లి వాగుకు వరద పోటెత్తింది. వరద నీరు మోరంచపల్లిని ముంచెత్తడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు ఇళ్లపైన నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు చెట్టుపై ఎక్కి సహాయం కోసం చూస్తున్నారు. స్థానికంగా ప్రస్తుత పరిస్థితి భయాందోళనగా మారింది.ఈ క్రమంలో వర్షాలు, వరదల బీభత్సంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అవేదన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఎమ్మేల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, సంబధిత అధికారులతో మంత్రి మాట్లాడుతున్నారు. నీట మునిగిన ప్రాంతాల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తామని భరోసా ఇచ్చారు.

" ప్రజలు అధైర్యపడొద్దు. ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. అన్ని ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఆహారం, నీరు అందిస్తున్నాం. పునరావాస కేంద్రాలను ఏర్పాట్లు చేశాం. వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు. చేపలు పట్టడానికి మత్స్యకారులు బయటకువెల్లోద్దు. విద్యుత్ తో అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి . రెస్క్యూ టీమ్స్ ని, చిన్న చిన్న పడవలను రంగంలోకి దించాలి. వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లను పెట్టండి. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించండి. సహాయక చర్యల్లో యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొనాలి " అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.














Tags:    

Similar News