తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్త జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ, ఏపీలతో సహా.. 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లు రానున్నారు. తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా.. ప్రస్తుతం కర్ణాటక హైకోర్ట్ జడ్జిగా ఉన్న అలోక్ ఆరాధేను నియమించింది. ముంబై హైకోర్ట్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఏపీ హైకోర్ట్ చీఫ్ గా నియమించింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం నిర్ణయం తీసుకుంది. ముంబైకి దేవేంద్రకుమార్, గుజరాత్ కు సునీతా అగర్వాల్, మణిపూర్ కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుభాసిస్ తలపత్ర హైకోర్ట్ జడ్జీలుగా నియమితులయ్యారు.