తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..

Update: 2023-08-01 10:45 GMT

సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. 143 ఎకరాల మంచిరేవుల భూములపై న్యాయస్థానం కీలక తీర్పు ప్రకటించింది. ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని ఉన్న అసైన్డ్‌ భూములు తెలంగాణ సర్కార్ , గ్రే హౌండ్స్‌వేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. గతంలో హైకోర్టు కూడా ఈ కేసులో తెలంగాణ సర్కార్‎కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.

1993లో కొంత మంది ప్రైవేటు వ్యక్తులు గండిపేట మండలం మంచిరేవులలోని 143 ఎకరాల అసైన్డ్ భూమిని విక్రయించి ప్లాట్‎లుగా మార్చారు. అసైన్మెంట్ చట్టం ప్రకారం 1977లో సర్కార్ వారికి నోటీసులు పంపించింది. దీంతో ఈ భూమి తమదని 2010లో ఆక్రమణదారులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని అప్పట్లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్, పోలీస్ షాఖ్ 2021లో డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ రిట్‌ పిటిషన్‌ను అనుమతించి.. సింగిల్‌ జడ్జి తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది.

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ ఇవాళ సుప్రీంలో విచారణకు వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లను కొట్టివేసింది. ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు ఇచ్చింది. 143 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది. అంతే కాదు ఈ భూముల విషయంలో కిందస్థాయి కోర్టులు, హైకోర్టులు ఎలాంటి జోక్యం చేసుకోకూడదని సుప్రీం తేల్చేసింది.


Tags:    

Similar News