MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత పిటిషన్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

By :  Kalyan
Update: 2023-07-28 11:31 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) పంపిన నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించింది. మహిళలను దర్యాప్తు సంస్థల కార్యాలయానికి పిలిపించుకుని విచారించడం చట్ట విరుద్ధమని ఆమె వాదించారు. ఎవరైనా సరే తన ఇంట్లోనే విచారించాలని కోరారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళినీ చిదంబరాన్ని కూడా కార్యాలయంలో విచారించలేదంటూ సంబంధిత పత్రాలు అందజేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఈడీకి, సంబంధిత విభాగాలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ ఆరువారాలకు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ లైసెన్సులను కవితతోపాలు పలువురు వ్యాపారులు కలిసి సిండికేట్ అయ్యి దక్కించుకోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. కవితను ఈడీ, సీబీఐలు పలుసార్లు విచారించాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు బెయిళ్లు రావడంతో కేసు వీగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు.


Tags:    

Similar News