Jallikattu : ఐపీఎల్ తరహాలో జల్లికట్టు లీగ్.. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక
తమిళనాడులో జల్లికట్టు ఆట పురాతన కాలం నుంచి సంప్రదాయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏటా ప్రభుత్వమే ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. కాగా ఇప్పుడు జల్లికట్ట ఆటకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తేవాలని తమిళనాడు ప్రభుత్వం అనుకుంటుంది. దీనికోసం ఐపీఎల్ తరహాలో.. జల్లికట్టులో కూడా ప్రతీ సంవత్సరం పోటీలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఐపీఎల్ తరహాలో జల్లికట్టు లీగ్ పోటీలకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు.. తమిళనాడు క్రీడాశాఖ మంత్రి, సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ తాజాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు మదురై జిల్లాలో ‘కలైంజ్ఞర్ సెంటినరీ ఏరుతళువదల్ అరెనా’ పేరుతో జల్లికట్టు స్టేడియాన్ని కూడా నిర్మించారు. ఈ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. త్వరలో జల్లికట్టు లీగ్ పోటీలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కాగా జల్లికట్టుకూ ఓ స్టేడియం నిర్మించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.