రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది..తమిళిసై కామెంట్స్

Byline :  Vamshi
Update: 2024-03-18 12:21 GMT

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు నేను ఎప్పటికీ మీ సోదరినే కాగా, నాపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని తెలిపారు. కాగా తమిళిసై తమిళనాడు నుంచి ఎంపీగా పోటీచేయనున్నట్లు సమాచారం.రాష్టాన్ని విడిచి వెళ్లాలంటే బాధగా ఉందని పేర్కొన్నారు.మరోవైపు రాజకీయల్లోకి తిరిగి వెళ్తున్నాననే సంతోషం ఉందని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ గుర్తించుకుంటానని తెలిపారు. త‌మిళ‌నాడులోని చెన్నై సెంట్ర‌ల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి త‌మిళిసై పోటీ చేసే అవ‌కాశం ఉంది. లేదంటే పుదుచ్చేరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఎక్క‌డ్నుంచి పోటీ చేస్తార‌నే అంశానికి త్వ‌ర‌లోనే తెర‌ప‌డ‌నుంది.2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు.

Tags:    

Similar News