పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ తో పొత్తుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (ఫిబ్రవరి 22) మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ శత్రుపూరిత వైఖరి సరికాదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిందని, లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఆ సొమ్మునంతా కక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. లేకపోయినా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. పొత్తుపై కాంగ్రెస్ పార్టీనే క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే ఎన్నికల్లో కలిసి వెళ్లే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో పొత్తు కుదరక పోవడంతో ఒంటరిగానే పోటీ చేసిన సీపీఎం.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ కాంగ్రెస్ తో కలిసి నడిచిన సీపీఐ పార్టీ మాత్రం ఒక స్థానంలో గెలిచారు. ఆ పార్టీ నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా కేంద్రంలో వామపక్షాలు కాంగ్రెస్ కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే.