తమ్మినేనికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

Byline :  Krishna
Update: 2024-01-16 10:11 GMT

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలోని నివాసంలో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు.

tammineni veerabhadram 

Tags:    

Similar News