బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి.. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారు టైర్ కూడా పేలినట్లు సమాచారం. ఎమ్మెల్యే కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రోహిత్ రెడ్డి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత రోహిత్ రెడ్డి క్షేమంగా ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
కర్నాటకలో ఉన్న శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళూరు సమీపంలోని ముడూరు- నల్లూరు క్రాస్ రోడ్ వద్ద కారు చెట్టును ఢీ కొట్టింది. విషయం తెలుసుకున్న కార్కాళ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థాలని చేరుకుని పరిశీలించారు. తర్వాత ఆయనను మరో ప్రభుత్వ వాహనంలో శృంగేరికి చేర్చారు. ప్రమాద జరిగిందని వార్త విన్న కుటుంబ సభ్యలు, పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. తర్వాత రోహిత్ రెడ్డి క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత తన యోగ క్షేమాలు వివరించిన రోహిత్ రెడ్డి.. తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం వాస్తవమేనని, తనకు ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు.