తాండూరులో వరుస హత్యలు.. సైకో కిల్లర్ అరెస్ట్

Byline :  Kiran
Update: 2023-12-08 10:31 GMT

వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పని ఇప్పిస్తానని మహిళలను కిడ్నాప్‌ చేసి వరుస హత్యలకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వికారాబాద్ లో మహిళల వరుస హత్యలు జరిగాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకూ కేసును చేధించారు. రెండు రోజుల క్రితం అడ్డా మీద ఉన్న ఓ మహిళను పని పేరుతో తీసుకెళ్లిన సైకో కిష్టప్ప హత్య చేశాడు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించారు. అందులో మృతురాలితో చివరగా కిష్టప్పతో మాట్లాడి తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో కిష్టప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళను చంపి మూటగట్టి పడేసినట్లు అంగీకరించాడు. పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు సైకో కిష్టప్ప ఒప్పుకున్నాడు. ప్రస్తుతం తాండూర్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సైకో కిష్టప్పను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు.

Tags:    

Similar News