Hyderabad Metro: హైదారాబాద్లో ఆగిపోయిన మెట్రో .. జనం అవస్థలు

By :  Kiran
Update: 2023-09-27 04:54 GMT

"హైదరాబాద్ లో మెట్రో రైలు నిలిచిపోయింది." నాగోల్ - రాయదుర్గం మార్గంలో నడిచే రైళ్లలో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తింది.( technical problem for hyd metro train) దీంతో రైళ్లు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయాయి. (Hyderabad Metro Train) ట్రైన్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నాగోల్ - రాయదుర్గం మెట్రో మార్గంలో ఉదయం 8 గంటల సమయంలో టెక్నికల్ ప్రాబ్లెం వచ్చింది. దీంతో రైలు పలు స్టేషన్లలో 5 నుంచి 15 నిమిషాల పాటు ఆగిపోయింది. ఈ ప్రభావం మిగతా రైళ్లపై పడింది. మెట్రో ట్రైన్ హబ్సిగూడలో 10 నిమిషాలు నిలిచిపోగా.. మెట్టుగూడలో ఒకసారి 15 నిమిషాలు మరోసారి 5 నిమిషాలు ఆగింది. ఆ తర్వాత తార్నాక స్టేషన్ లోనూ 10 నిమిషాలు పాటు నిలిచిపోయింది. ఈ ఎఫెక్ట్ మిగతా స్టేషన్లపై పడింది.

"మెట్రో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు". కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో స్టేషన్లన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. అమీర్ పేట్ స్టేషన్ లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాధారణంగానే రద్దీగా ఉండే ఆ స్టేషన్లో కనీసం నిలబడేందుకు జాగా లేక ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారు. కాసేపటికి సాంకేతిక సమస్యను సరిచేసి సర్వీసులు ప్రారంభించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News