Teenmar Mallanna : తెలంగాణలో కొత్త పార్టీ.. ECకి దరఖాస్తు చేసుకున్న తీన్మార్ మల్లన్న

Byline :  Bharath
Update: 2023-09-07 02:09 GMT

teenmar mallanna,new political partyతెలంగాణ రాజకీయాలు, సమస్యలపై ప్రశ్నిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్). ఇప్పుడు రాజకీయాల్లోనూ రాణించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేయబడ్డారు. చర్లపల్లి జైలు నుంచి తిరిగొచ్చిన ఆయన తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు అభిమానులు, మద్దతుదారుల సమక్షంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తన పార్టీ పేరును తెలంగాణ నిర్మాణ పార్టీగా పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.




 


కాగా తన అధ్యక్షతన తెలంగాణ నిర్మాణ పార్టీ పేరును రిజిస్టర్ చేయాలని ఎలక్షన్ కమీషన్ (EC)కు తాజాగా దరఖాస్తు చేసుకున్నారు మల్లన్న. పార్టీ పేరు, ఇతర అంశాలపై ఏవైనా అభ్యంతరాలు, సందేహాలుంటే సెప్టెంబర్ 30లోగా తెలియజేయాలని EC అధికారిక వెబ్ సైట్ లో తెలిపింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాదం రజినీ కుమార్ (వరంగల్ జిల్లా ధర్మసాగర్), కోశాధికారిగా ఆర్. భావన (చంపాపేట్, సరూర్ నగర్) ఉంటారని అప్లికేషన్ లో తెలిపారు.


 


Tags:    

Similar News