వికాస్ రాజ్‌కు 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తులేదు.. రేవంత్

Update: 2023-11-25 10:38 GMT

తెలంగాణ ఫ్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పక్షపాతంతో వ్యవరిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఐఏఎస్, కేసీఆర్ ప్రభుత్వం మాజీ సలహాదారు ఏకే గోయల్ దాచిన డబ్బు గురించి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘‘గోయల్ ఇంటి నుంచి రూ. 1,000 కోట్లను మంత్రులకు పంపిణి చేశారు. ఆ ఇంట్లో ఇంకా రూ. 300 కోట్లు ఉన్నాయి. ఈ సంగతి చెప్పడానికి మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు కాల్ చేసినా వికాస్ రాజ్ లిఫ్ట్ చేరయలేదు. ఆయనకు ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు ఎంపీలం ఎంతోసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గోయల్ ఇంట్లో జరిగిన విషయాన్ని దాచిపెట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు’’ అని రేవంత్ ఆరోపించారు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరేందుకు సహకరించిన వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉసిగొలిపి వేధిస్తున్నారని విమర్శించారు.

నవంబర్ 15 లోపే రైతుబంధు వేయాలని కోరినా కావాలనే పోలింగ్‌కి నాలుగు రోజుల ముందు వేశారని రేవంత్ మండిపడ్డారు. దీని వెనక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం హస్తముందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందేనని, వాటి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపించారు. ‘‘కేసీఆర్ కోరిక మేరకే మోదీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించారు. మోదీ మాటలకు, చేతలకు పొంతనే లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. దాన్ని మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా పైకి లేవదు’’ అని అన్నారు. సర్వేలన్నీ తమ పార్టీకే అనుకూలంగా ఉన్నాయన్న రేవంత్ తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. 

Tags:    

Similar News