విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం
Byline : Veerendra Prasad
Update: 2023-11-28 09:28 GMT
తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈనెల 30న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు (నవంబర్ 29), ఎల్లుండి (నవంబర్ 30) హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. తిరిగి డిసెంబర్ 1న యథావిధిగా విద్యాసంస్థలు నడవనున్నాయి.