తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-14 05:36 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తొలుత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కేటీఆర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక ఆ తర్వాత తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన్ను స్పీకర్‌ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. మరోవైపు పార్లమెంట్‌లో దాడి ఘటనతో అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

అనారోగ్య కారణాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సభకు హాజరుకాలేదు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాము ప్రమాణస్వీకారం చేయబోమని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా ప్రమాణస్వీకారం చేయలేదు.

Tags:    

Similar News