ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా

Update: 2023-08-06 13:20 GMT

ఆర్టీసీ విలీనం బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. గవర్నర్ అనుమతితో మంత్రి పువ్వాడ అజయ్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యధాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికుల బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని చెప్పారు.

అనంతరం సభ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో మూజువాణి ఓటుతో బిల్లు పాసైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. అనంతరం శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. 2019 నుంచి సభ సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ స్పీకర్ ధన్యవాదాలు చెప్పారు.

ఆర్టీసీ బిల్లుకు ఆమోద ముద్ర పడటంతో అసెంబ్లీ సమావేశాల పొడగింపు నిర్ణయం ఉపసంహరించుకున్నారు. తొలుత అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు పొడగించాలని నిర్ణయించారు. అయితే ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అసెంబ్లీ ఆమోదం పొందడంతో పొడగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.




Tags:    

Similar News