TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

Byline :  Krishna
Update: 2024-02-12 11:26 GMT

తెలంగాణ శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. కేఆర్ఎంబీకీ ప్రాజెక్ట్ అప్పగించొద్దని అసెంబ్లీ తీర్మానించింది. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. బీఆర్ఎస్ కూడా మద్ధతు పలికింది.

దీంతో తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రధాన జీవనాధరమని.. నీటివాటాలు కాపాడడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని స్పష్టం చేశారు. 299 టీఎంసీలు తెలంగాణ వాటాగా బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకుందని చెప్పారు. నాగార్జున సాగర్ పై ఏపీ పోలీసులను ఉపసంహరించుకోవాలని సూచించారు. నీటి వాటా విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ కేంద్రం ముందు తన వాదానను బలంగా వినిపించలేదని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల విషయంలో కొంత మంది అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. గత పాలకుల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు.

రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో కృష్ణా నీటి ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు గత ప్రభుత్వం ఒప్పుకుందన్న విషయాన్ని హరీష్ రావు ఖండించారు. ఇది అసత్య ఆరోపణగా ఆయన తెలిపారు. ఇందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖ నిదర్శనం అంటూ లేఖను ఆయన చూపించారు. అయితే సాగు నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎక్కడ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రాకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభలో ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News