పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. వికారాబాద్, యాదాద్రి, నిజామాబాద్, సిద్ధిపేట జిల్లా అధ్యక్షులను మార్చింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాధవరెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేశ్, సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడిగా మోహన్ రెడ్డిలను నియమించింది. అదేవిధంగా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్ లను నియమించారు.
లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల అధ్యక్షులను మార్చింది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఈ సారి ఎనిమిది స్థానాలకు తగ్గకుండా గెలవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జులను కూడా నియమించింది. అటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు సైతం ప్రారంభించింది. ఇటీవలే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.