మనసులో ఏముంటే అది బయటికి కక్కేసే బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే ఆయన పనితీరు ఇప్పుడు చాలా మారిపోయిందని, ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని అన్నారు. ‘‘కేసీఆర్ 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ చాలా గొప్పగా పాలించారు కానీ 88 స్థానాల్లో గెలిచాక పొగరెక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక అహంకారం పెరిగింది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతిన్నారు’’ అని టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
కేసీఆర్‌ను ఈసారి ఎలాగైనా ఓడించి తీరాలని ఢిల్లీ పెద్దలు కంకణం కట్టుకున్నారని, అందుకే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి వస్తున్నారని జితేందర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ అనుబంధమున్న ఆరోపణలపై స్పందిస్తూ.. అవినీతి ఆరోపణలున్న కేసీఆర్‌ను దగ్గరికీ తీసుకోరని, ఎక్కువగా మాట్లాడొద్దని బెదిరించి ఉండొచ్చని అన్నారు. కాంగ్రెస్ కర్నాటక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సరిపోదని, అది వాపే కానీ బలుపు కాదని అన్నారు.