డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ప్రకటన జారీ చేసింది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ రాజ్భవన్ వెళ్లిలో గవర్నర్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ మూడో శాసనసభకు నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. 119 నియోజకవర్గాల్లో దాదాపు 70.79శాతం ఓటింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.