నాగార్జున సాగర్‌ గొడవపై నేతలకు ఈసీ సంఘం వార్నింగ్

By :  Lenin
Update: 2023-11-30 05:47 GMT

తెలంగాణ పోలింగ్ రోజున నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ రాజకీయ రంగు పులుముకుంది. పోలింగ్ రోజన కావాలనే వివాదాన్ని సృష్టించారని తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. గొడవతో తమకేం సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఈ వివాదం పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశముండడంతో తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ రంగంలోకి దిగారు. నాగార్జున సాగర్ వివాదంపై రాజకీయ నాయకులు మాట్లాడకూడదని హెచ్చరించారు. ‘‘ఈ వివాదాన్ని పోలీసులకు వదిలివేయాలి. ఏం చేయాలో వాళ్లే చూసుకుంటారు.. పోలింగ్ ప్రశాంతంగా సాగడానికి అందరూ సహకరించాలి. పోలింగ్ సజావుగా సాగుతోంది. కిందటిసారికన్నా ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా చూస్తున్నాం’’ ని చెప్పార. 

Tags:    

Similar News