అందుకే అలా చేశాను..ట్విటర్‎లో కేసీఆర్ మనవడి ట్వీట్

By :  Kiran
Update: 2023-07-24 02:39 GMT

తాతకు తగ్గ మనవుడు. తండ్రికి తగ్గ కొడుకు, అత్తకు తగ్గ అల్లుడు అని పేరు తెచ్చుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు రావు. ఓ వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటూనే మరోవైపు తనలోని టాలెంట్‎ను తన ఫాలోవర్స్‌కు పరిచయం చేస్తుంటాడు. పేద పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించడం, అవసరమైతే వారికి పుస్తకాలను కొనివ్వడం ద్వారా ఎంతో మంది పిల్లలకు సాయం అందించాడు. ఈ మధ్యనే ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ప్రైవేటు స్కూల్స్‎ కు ధీటుగా సదుపాయాలను కల్పించి సభాష్ అనిపించుకున్నాడు. సోషల్ మీడియాలో హీరో అయ్యారు హిమాన్షు.

ఇవన్నీ పక్కన పెడితే హిమాన్షు రీసెంట్‎గా ఓ అనౌన్స్‎మెంట్ చేశాడు. తన తండ్రి కేటీఆర్ బర్త్ డే రోజైన జులై 24న ఆయనకు గిఫ్ట్‎గా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా తన ట్విటర్‎లో షేర్ చేసి మురిసిపోయారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రెట్టీ పాటను విడుదల చేయలేకపోతున్నానని తాజాగా హిమాన్షు తెలిపాడు. పాట రిటీజ్ డేట్‎ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తన ట్విటర్ అకౌంట్‎లో ట్వీట్ చేశాడు. అన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలోనే పాటను మరో తేదీన విడుదల చేస్తానని ప్రకటించాడు. 

Tags:    

Similar News