సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 08:31 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఈనాడు ఢిల్లీలో జరగనున్న కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. అంతకుముందు ఢిల్లీ పర్యటన ఉందన్న క్రమంలో ఈ రోజు జిల్లా కలెక్టర్లతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ను వాయిదా వేశారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో.. కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని కొందరు అధికారులు చెప్పకుంటున్నారు.

ఇక ఈ రోజున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు సమావేశమై... 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు, ఎంపీ సీట్ల కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇక సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, స్పెషల్ ఇన్వైటీ అయిన వంశీచంద్ రెడ్డి కూడా సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలిసింది. ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, సుబ్బరామి రెడ్డి పాల్గొననున్నారు.

Tags:    

Similar News