మేడిగడ్డపై సీబీఐ దర్యాప్తు.. హైకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో తేల్చడానికి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ ఈ పిటిషన్ వేశారు.
హైకోర్టు రిజిస్ట్రీ ఈ దావాను పరిశీలనకు తీసుకుంది.
మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలున్నాయని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ గత నెల నివేదికలో స్పష్టం చేసిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేయాలని నిరంజన్ కోరారు. పిల్లర్ల కుంగుబాటుకు కారణమైన వారిపై క్రిమినల్ చర్యల తేసుకునేన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో రూ. 86 వేల కోట్లు సేకరించి ఎలా ఖర్చుపెట్టాలో కేంద్ర దర్యాప్తు సంస్థలో విచారణ జరిపించాలని కోరారు. పిల్లర్లు కుంగడంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదులో జయశంకర్ జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
ప్రాజెక్టు కింది ఇసు కొట్టుకుపోవడంతోనే పిల్లర్స్ సపోర్ట్ బలహీనపడిందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో వివరించింద. పునాదులకు వాడిన మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉందని, పిల్లర్లు కుంగిపోవడానికి ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ, మెయింటెనెన్స్ లో లోపాలు కారణమని తెలిపింది.