Congress BC Ticket Fight: కాంగ్రెస్లో ఆగని బీసీ టికెట్ల పంచాయతీ.. అధిష్టానానికి అల్టిమేటం..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కాంగ్రెస్లో టికెట్ల అంశం ఓ కొలిక్కి రావడం లేదు. దరఖాస్తులు స్వీకరించి రోజులు గడుస్తున్నా వడపోత కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బీసీ టికెట్ల పంచాయతీ షురూ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని బీసీ నేతలు స్పష్టం చేశారు. ఇవాళ గాంధీభవన్ లో సమావేశమైన బీసీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం పంపారు.
ఢిల్లీలో శుక్రవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. ఈ క్రమంలో ఇవాళ సమావేశమైన బీసీ లీడర్లు రేపు గాంధీభవన్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించారు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ధర్నా అంశాన్ని ప్రకటించారు. హలో బీసీ.. ఛలో గాంధీభవన్ పేరిట ఆందోళనలు చేపట్టనున్నారు. నాలుగు అంశాలతో అధిష్టానానికి అల్టిమేటం పంపారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ లాంటి పదవులు ఎరవేస్తే కుదరదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.