7న రేవంత్ ప్రమాణ స్వీకారం! ‘డిప్యూటీ’ మంతనాలు

By :  Lenin
Update: 2023-12-04 14:44 GMT

తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేవంత్‌రెడ్డి ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సీఎం పదవికి ఆయన పేరు దాదాపు ఖరారైందంని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రుల ఎంపికపై మంతనాలు జరుగుతున్నాయని, అధిష్టానం రేపోమాపో సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లను ప్రకటిస్తుందని అంటున్నారు. వాస్తవానికి ఈ రోజే(డిసెంబర్ 4) రేవంత్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు సాగాయి. సీఎల్పీ సమావేశం, మంతనాలు వల్ల పొద్దుపోవడంతో వాయిదా పడింది.

ఈ నెల 7న మూహూర్తం బావుండడంతో ప్రమాణ స్వీకారాన్ని ఆ రోజుకు మార్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటు మంత్రులతో కొత్త కేబినెట్ కొలువు తీరుతుందని చెప్పాయి. డిప్యూటీ సీఎంలుగా మల్లు భట్టి విక్రమార్క, సీతక్కల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. బీసీ కోటా నుంచి పొన్నం ప్రభాకర్ కు కూడా అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. 

Tags:    

Similar News