కేసీఆర్‌ అవినీతిపై కేసులెందుకు పెట్టలేదు... బీజేపీపై రేవంత్ ఫైర్

Update: 2023-09-17 05:48 GMT

బీజేపీ, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని, ఒకదానిపై ఒకటి చేసుకునే విమర్శలు బూటకమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు జరిపే దమ్ము బీజేపీ లేదని అన్నారు. అవినీతిలో మునిగి తేలుతున్న బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ఆయన ఆదివారం తాజ్ కృష్ణ హోటల్లో సాగుతున్న సీడబ్ల్యూ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ అవినీతికి ఏటీఎంగా మార్చుకుని మిగతా ప్రాజెక్టులపై పడిందని అన్నారు.

‘‘కేసీఆర్‌కు కాళేశ్వరం ఓ ఏటీఎం. ఇప్పుడు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులోనూ అదే చేస్తున్నాడు. దానికి అయిన ఖర్చుకన్నా చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కువ. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో బీజేపీ, బీఆర్ఎస్ దొంగనాటకాలు ఆడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కూతురిని జైలుకు పంపేందుకు కేసీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. బిడ్డ అరెస్టయితే సానుభూతి ఓట్లు పడాయని ఆశపడుతున్నాడు’’ అని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీలో భాగంగా కేసీఆర్‌ అనుచరుడైన కిషన్‌ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుణ్ని చేశారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేకనే సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ అవినీతి ఇప్పటివరకు ఈడీ, సీబీ ఇంతవరకు ఏమీ చేయాలేకపోయాయి. కనీసం ఈగ కూడా వాలలేదు. మోదీ, అమిత్‌ షా, నడ్డా చేసే విమర్శలన్నీ పైపైనే. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్ అవినీతిపరడని అంటున్న బీజేపీ ఆయనపై కేసులెందుకు పెట్టడం లేదు?’’ అని రేవంత్ ప్రశించారు.

Tags:    

Similar News