CWC meeting: బోటి కూర, మటన్ కర్రీ, సర్వపిండి.. CWC సమావేశాల్లో తెలంగాణ వంటలు

Byline :  Bharath
Update: 2023-09-15 14:27 GMT

హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలంతా హైదరాబాద్ కు రానున్నారు. ఈ సమావేశాలకు వచ్చే అతిథులకోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 రకాల తెలంగాణ ఫుడ్ వెరైటీలను వడ్డించనున్నారు. టిఫిన్ నుంచి లంచ్ వరకు మొత్తం తెలంగాణ స్టైల్లోనే వైరైటీల విందు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఫుడ్ ఐటమ్స్ తయారుచేయడానికి వంట మనుషులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఉదయం టిఫిన్ లో ఇడ్లీ, వడ, దోశ, ఫ్రూట్ సలాడ్, ఉప్మా, కిచిడీ, కుర్మా, రాగి సంగటి, మిల్లెడ్ వడలను వడ్డించనున్నారు.




 


అంతేకాకుండా మధ్యాహ్నం లంచ్ కు హైదరబాదీ ధమ్ బిర్యానీ, బగార అన్నం, బోటి కూర, తలకాయ కూర, పాయ, మటన్​, మేక లివర్​ ఫ్రై, తెలంగాణ స్పెషల్​ మటన్​ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్​, దోసకాయ మటన్​, అంకాపూర్​ చికెన్​, చేపలు, హలీం వంటి వాటిని నాన్​ వెజ్​ మెనూగా పెడుతున్నారు. వీటితో పాటు వెజ్​ ఐటమ్స్ లో పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు వడ్డించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం స్నాక్స్ కోసం సర్వపిండి, కుడుములు, మురుకులు, మక్క గుడాలు, మొక్క జొన్న గారెలు, సకినాలు, గారెలను అతిథులకు రుచి చూపిస్తున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. వీటన్నింటితో పాటు మరో 12 రకాల స్వీట్ ఐటమ్స్, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లను వడ్డించనున్నారు.




 




Tags:    

Similar News