తెలంగాణ డీజీపీకి అత్యుత్సాహం కొంప ముంచింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందుకు వేటు పడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనర్హం. అంజనీ కుమార్ ఈ రోజు ఉదయం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడంపై విమర్శలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే డీజీపీ ఓ రాజకీయ నాయకుణ్ని కలవడం సరికాదని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ఉంల్లంఘించిన అంజనీ కమార్ పదవిలో ఉండడం సరికాదని సస్పెన్షన్ వేటు వేసింది. కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంజనీ కుమార్ ఏర్పాట్లు చేస్తుండగా ఈసీ ఆయనను పదవి నుంచి తప్పించింది.