EAMCET Schedule : స్టూడెంట్స్కు అలర్ట్.. రెండు రోజుల్లో ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్..!
ఎంసెట్ ఎగ్జామ్ నిర్వాహణ, రాతపరీక్షలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. పలు ఎంట్రెన్స్ టెస్టులకు సంబంధించి ఉన్నత విద్యామండలి రూపొందించిన టైం టేబుల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఎంసెట్ పేరు మార్చే యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దానికి సంబంధించిన జీవో జారీ అయితే ఇవాళ సాయంత్రం లేదా రేపు ఎంసెట్ రాత పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఎంసెట్‌లో మెడికల్ లేకపోవడంతో M పదాన్ని తొలగించేందుకు అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సంబంధంచి ప్రభుత్వం ఆమోదం తెలిపి జీవోను జారీ చేయాల్సి ఉంది.
ఎంసెట్‌తోపాటు ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్‌ల తేదీలను ప్రకటించనున్నారు. మే రెండో వారంలో ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉంది. పీఈసెట్, పీజీఈసెట్లు మాత్రం మే చివరి నుంచి జూన్ తొలి వారంలో నిర్వహించనున్నట్లు సమాచారం.ఈసెట్ ను మే మొదటి వారంలో నిర్వహించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.