జనగామలో భారీగా బంగారం జప్తు

Byline :  Mic Tv Desk
Update: 2023-10-23 15:50 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డబ్బులు, బంగారం చాపకింద నీరులా తరలిపోతున్నాయి. చేరాల్సి జేబుల్లోకి, చేతుల్లోకి చేరిపోతున్నాయి. తాజాగా ఆదివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు జరిపిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీనికి సంబంధించి వివరాలు రాబట్టడానికి స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలుల రూ.3 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. ప్రముఖ నగల దుకాణాల నుంచి ఈ బంగారం తీసుకొచ్చారని, దర్యాప్తు కోసం ఐటీ శాఖకు అప్పగించామని తెలిపారు. తనిఖీల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఏపీబీ అధికారి శ్రీనివాసరావు, సీఐలు సార్ల రాజు, ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రఇదే టోల్ ప్లాజా దగ్గర మూడు రోజుల కిందట కూడా రూ. 37 లక్షల నగదు దొరికింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పట్నుంచి రూ. 300 కోట్లకుపైగా నగదు పట్టుబడింది. పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా బంగారం, వెండి వస్తువులను ఓటర్లకు పంచడానికి సరఫరా చేస్తున్నాయని పట్టుబడుతున్న సరుకే చెబుతోంది. నగదు రూపంలో అయితే వెంటనే బయటపడుతుందని నగల రూపంలో తరలిస్తున్నారు.


Tags:    

Similar News