తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కొద్ది నిమిషాల క్రితమే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటుచేశారు. పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి.. లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 8.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ షురూ చేయనున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 14 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఒకే చోట కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.