కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్

Byline :  Lenin
Update: 2023-12-08 16:08 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక మార్పడి కోసం నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం సాయత్రం 4 గంటలకు ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించి నాలుగు గంటల పాటు నిర్వహించారు. హిప్ రీప్లేస్‌మెంట్ సజావుగా సాగిందని వైద్యులు చెప్పారు. మాజీ సీఎంను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూ గదికి తరలించారు. ఆయన గదిలోకి తీసుకెళ్తున్న వీడియోలు బయటికి వచ్చాయి. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో 20 మంది వైద్యుల బృందం బీఆర్ఎస్ అధినేతకు సర్జరీ చేసింది. కేసీఆర్ గురువారం అర్ధరాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ బాత్రూంలో కాలు జారి పడ్డంతో తుంటి ఎముక విరిగింది. ఆయన రెండు నెలల వరకు కదిలే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు.

Tags:    

Similar News