అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

Update: 2023-06-02 05:04 GMT

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. నేటికి తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఇక మరికాసేపట్లో సీఎం సచివాలయానికి చేరుకుంటారు. జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు.




వేడుకల్లో భాగంగా ముందుగా ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, ప్రగతి భవన్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News