తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నవంబర్ 30వ తేదీన కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ నిర్ణయించింది. పోలింగ్ వల్ల పనులకు పోలేరు కనుక ఫ్యాక్టరీలు, షాపులు తదితర పని ప్రదేశాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్లందరూ ఓటేసేందుకు వీలుగా నిర్ణం తీసుకున్నామని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 గురువారం నాడు ఓకే విడుతలో జరగనున్నాయి. ఫలితాలను 3 వ తేదీన ప్రకటిస్తారు.