Telangana Government : ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2024-01-26 07:45 GMT

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయంతో 231 మంది ఖైదీలు విడుదల కానున్నారు. జీవిత ఖైదు అనుభవిస్తూ.. అనారోగ్యం, వయోభారం, ఇతర సమస్యలతో జైళ్లలో ఇబ్బంది పడుతున్నవారి శిక్షాకాలాన్ని తగ్గించి, క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాల్లో 400 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసింది. రేవంత్‌ సర్కారు కూడా ఇప్పుడు ఈ అంశంపై దృష్టిసారించింది. క్షమాభిక్షపై నూతనమార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిపై జైళ్లశాఖ, పోలీసు ఉన్నతాధికారులు భేటీ అవుతున్నారు.

తాజాగా డీజీపీ రవిగుప్తా, జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, ఇతర ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర కారాగారాలు, జిల్లా జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న 231 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాధించారు. క్షమాభిక్షకు మహిళలకు ఐదేళ్లు, పురుష ఖైదీలకు 7 ఏళ్లను కటా్‌ఫగా నిర్ణయించే అవకాశముంది. ప్రస్తుతం 14 జైళ్లలో 276 మంది జీవిత ఖైదీలున్నారు. వారిలో 50 మంది పదేళ్లు, 9 మంది 25 ఏళ్ల మేర శిక్షను పూర్తిచేసుకున్నారు.దీంతో ఖైదీలను విడుదల చేయాలని కొంత కాలంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, ఖైదీల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా 231 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఎంపిక చేసింది.


 


Tags:    

Similar News