తెలంగాణ స్టాఫ్‌ నర్స్ తుది ఫలితాలు విడుదల

Update: 2024-01-28 16:29 GMT

తెలంగాణ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలు విడుదల అయ్యాయి. స్టాఫ్ నర్సు రాత పరీక్ష కటాఫ్ మార్కులు, ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ జాబితాను వైద్య, ఆరోగ్య నియామక బోర్డు ప్రకటించింది. స్టాఫ్ నర్సు పోస్టుల తుది ఫలితాలను అధికారిక వెబ్ సైట్ mhsrb.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు. గతేడాది ఆగస్టు 2 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో 7,094 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 30న ప్రకటన వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి గత ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షకు రాష్ట్రవ్యా ప్తంగా 40,936 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారికి గతేడాది జూలైలో ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించింది. గత నెలలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. తాజాగా స్టాఫ్ నర్స్ తుది ఫలితాలను విడుదల చేశారు. సెలక్షన్‌ లిస్ట్‌ను ఎంహెచ్‌ఎస్సార్బీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

Tags:    

Similar News