ఆ భవనాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

Update: 2023-12-11 11:40 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వ్యవహారాలపై స్పీడ్ పెంచింది. ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక పథకాల అమలుపై సీఎం కేసీఆర్, మంత్రులు వరుసపెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక అసెంబ్లీ భవనాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాడకంలో లేని పాత అసెంబ్లీ భవనాల వినియోగం, సుందరీకరణపై దృష్టి సారించింది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరాలను వెల్లడించారు. శాషన సభా పక్ష పార్టీల కార్యాలయాలున్న ఎల్పీ భవనాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ఎల్పీ భవనం జాగాలో సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి శాసస సభా ప్రాంగణాన్ని పరిశీలించనున్నారని, అనంతరం సుందరీకరణ పనులు మొదలుపెట్టనున్నట్లు మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును 'మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్'గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలను తొలగించి వీఐపీలతో పాటు సామాన్య జనానికి కూడా ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కల్పించంది.


Tags:    

Similar News