రేవంత్ సర్కార్ మరో సంచలనం.. వారు రాజీనామా చేయాలంటూ ఆదేశాలు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-07 15:44 GMT

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల విషయంలో వివాదం నడుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా సీనియర్ అధికారి ENC మురళీధర్‌ రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేఆర్ఎంబీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మురళీధర్ రావుపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు మురళీధర్ రావును రాజీనామా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. అదే విధంగా రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ చార్జ్ వెంకటేశ్వరరావును సర్వీస్ నుండి తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాజెక్టులు అప్పగింతలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సర్కార్ సీరియస్ అయింది. మేడిగ‌డ్డ‌పై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంది ప్ర‌భుత్వం.కాగా, అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనున్న వేళ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News